UPDATED 7th JULY 2022 THURSDAY 5:30 PM
పెద్దాపురం: పెద్దాపురం మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా పి. విజయ్ థామస్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతవరకు ఇన్ ఛార్జ్ ఎంపీడీవోగా ఇక్కడ పని చేసిన కరక హిమమహేశ్వరి సామర్లకోట ఈవోపీఆర్డీగా బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో ప్రత్తిపాడు ఎంపీడీవోగా విధులు నిర్వర్తిస్తున్న విజయ్ థామస్ డిప్యుటేషన్ పై ఇక్కడ ఎంపీడీవోగా భాద్యతలు చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అందరి సహకారంతో పెద్దాపురం మండల అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈవోపీఆర్డీ కె. రాజశేఖర్, కార్యాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియచేశారు.







