జగన్‌పై దాడికి నిరసన

UPDATED 25th OCTOBER THURSDAY 9:00 PM

సామర్లకోట: విశాఖపట్నం విమానాశ్రయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగిన విషయం తెలియగానే పట్టణంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. గురువారం స్థానిక స్టేషన్ సెంటర్ లో పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వం తీరును నిరసిస్తూ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పార్టీ పెద్దాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ తోట సుబ్బారావునాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, జగన్‌పై దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నామని అన్నారు. పటిష్టమైన బందోబస్తు ఉండే విమానాశ్రయంలోకి కత్తి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. అక్కడ భద్రత ఏమైందని మండిపడ్డారు. రాష్ట్రంలో జగన్‌ పాదయాత్రకు వస్తున్న ఆదరణ జీర్ణించుకోలేక దాడులకు పాల్పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దాల శ్రీనివాస్, ఆవాల లక్ష్మీనారాయణ, కాళ్ల లక్ష్మీనారాయణ, నేతల హరిబాబు, మేకా శ్రీను, సేపేని సురేష్, శెట్టిబత్తుల దుర్గ, కానుబోయిన విజయకృష్ణ, ఎం. రమణ, లింగం శివ, రెడ్డి శ్రీను, కమల్ రాజ్, పిల్లా సురేష్, చిట్టిమాని శ్రీనివాస్, గంపా శివ, గోపు మురళీ, పాఠంశెట్టి రాఘవ, మేడిశెట్టి భద్రం, తాటికొండ అచ్చిరాజు, కంటే వీరాఘవులు, సారంపాటి లోవాచారి, పుట్టా సూరిబాబు, అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us