UPDATED 26th DECEMBER 2020 SATURDAY 8:00 PM
పెద్దాపురం (రెడ్ బీ న్యూస్): నూతనంగా నిర్మితమవుతున్న తెలుగు వెబ్ సిరీస్ కోసం కార్తీక దీపం హీరో నిరుపమ్ పరిటాల, నటి నిత్యామీనన్ పెద్దాపురం పట్టణంలో శనివారం హల్ చల్ చేశారు. గీత గోవిందం, జనతా గ్యారేజ్, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, ఇష్క్, తదితర చిత్రాలతో పేరు పొందిన నటి నిత్యా మీనన్ దక్షిణాదిలో ఆసక్తికరమైన చిత్రాల వరుసలో బిజీగా ఉన్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో బ్రీత్‌తో ఈ నటి డిజిటల్ ప్రదేశంలో అడుగుపెట్టడంతో పాటు ఇప్పుడు ఆమె తన మొట్టమొదటి తెలుగు వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. కార్తీక దీపం సీరియల్ లో డాక్టర్ బాబు పాత్రలో నటిస్తూ పేరు ప్రఖ్యాతలు పొందిన నిరుపమ్ పరిటాల, నిత్యా మీనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ షూటింగ్ పెద్దాపురం పట్టణంలోని మున్సిపల్ ఆఫీస్, గాలి బంగ్లా, తదితర ప్రాంతాల్లో శనివారం జరిగింది.







