UPDATED 13th OCTOBER 2019 SUNDAY 9:00 PM
సామర్లకోట(రెడ్ బీ న్యూస్): పాస్టర్ల ఆశీర్వాదంతోనే విశ్వాసులు ఆత్మీయంగా ఎదుగుతారని ప్రముఖ టీవీ ప్రసంగీకులు ఆంధ్ర బాప్టిస్ట్ చర్చి పాస్టర్ డాక్టర్ ఈలి సువార్తరాజు అన్నారు. ప్రపంచ పాస్టర్ల దినోత్సవాన్ని ఆదివారం ఆంధ్ర బాప్టిస్టు చర్చిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చెన్నై నుంచి సామర్లకోట మహాసభలకు విచ్చేసిన ప్రముఖ అంతర్జాతీయ సువార్తికులు డాక్టర్ శౌరిబాబు, డాక్టర్ సువార్త రాజులను సంఘ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ సువార్తరాజు మాట్లాడుతూ దైవజనులు వల్ల సంఘంలో మంచి ఆత్మీయత, స్వస్థత కలుగుతుందని అన్నారు. దైవజనులు వల్ల క్రీస్తునందు ప్రతీ విశ్వాసి సంపూర్ణంగా ఉంటారని అని అన్నారు. దేవుడు మాటలు బైబిల్ ద్వారా నడిపించడం వలన ప్రతీ విశ్వాసి పాపాల నుంచి విముక్తి పొంది పరలోకానికి వెళతారని అన్నారు. ముఖ్య అతిథి డాక్టర్ డాక్టర్ శౌరిబాబు మాట్లాడుతూ విశ్వశాంతి కోసం సర్వ మానవుల రక్షణకు జీసస్ చేసిన త్యాగాన్ని వివరించి క్రీస్తు సందేశాన్ని వినిపించారు. దేవునికి అత్యంత పవిత్రమైన ఇజ్రాయేలు దేశాన్ని ప్రతీ క్రైస్తవుడు ఒకసారి దర్శించుకోవాలని, పాస్టర్ సువార్తరాజు 44 సార్లు ఏసుక్రీస్తు జన్మ స్థలాన్ని సందర్శించి అందరికీ ఆదర్శంగా నిలిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు బిఎస్ వందనం, కార్యదర్శి టి. సూర్యారావు, కోశాధికారి పి. సత్యనారాయణ, సంఘం యూత్ మాజీ అధ్యక్షులు ఏ. వీర్రాజు, సంఘ నాయకులు అమర్ కళ్యాణ్, జెడి రాజు, బి. రామారావు, డేవిడ్ రాజు, సంఘ ఆత్మీయ తల్లి షోరోన్ రోజ్, అధిక సంఖ్యలో సంఘ విశ్వాసులు పాల్గొన్నారు.







