UPDATED 25th FEBRUARY 2019 MONDAY 9:00 PM
సామర్లకోట: సృజనోత్సవ సైన్స్ ప్రతిభా పరీక్షా పోటీలు స్థానిక సిబిఎమ్ ఉన్నత పాఠశాలలో సోమవారం నిర్వహించారు. సామర్లకోట మండల విద్యాశాఖాధికారి వైవి శివరామకృష్ణయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో ఉప్పరగూడెం, మాధవపట్నం, ఉండూరు, వికె రాయపురం, వేట్లపాలెం గ్రామాలతో పాటు పట్టణ పరిధిలోని వివిధ ఉన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో భాగంగా విద్యార్థులకు సైన్స్ పై పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో వికె రాయపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థితో పాటు స్థానిక అయోధ్యరామాపురం ఉన్నత పాఠశాలకు చెందిన కందికొండ మహాలక్ష్మి ప్రతిభ కనబరిచారని, వీరిని జిల్లాస్థాయి పోటీలకు పంపనున్నట్లు ఎంఈవో తెలిపారు.







