హుస్సేన్ పురంలో స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాలీ

UPDATED 11th AUGUST 2018 SATURDAY 9:00 PM

సామర్లకోట: సామర్లకోట మండలం హుస్సేన్ పురం గ్రామంలో స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాలీ శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షుడు చల్లా బుజ్జి మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో మంచి ఉద్దేశ్యంతో స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో పారిశుద్యం, పరిశుభ్రమైన త్రాగునీరు, అలాగే సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజలకు పలు కార్యక్రమాల ద్వారా తెలియచేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మోహన్ చౌదరి, వీఆర్వో ఖాదర్ వల్లి, ఫీల్డ్ అసిస్టెంట్, యానిమేటర్స్, సాధికార మిత్రలు, అంగన్వాడీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us