UPDATED 14th AUGUST 2019 WEDNESDAY 9:00 PM
సామర్లకోట: సామర్లకోట రైల్వే పోలీస్ స్టేషన్ ప్లాట్ ఫారం నెంబర్ 1 నుంచి రైలు పట్టాలు దాటుతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతుని వయసు సుమారు 40 నుంచి 45 సంవత్సరాలు ఉండొచ్చని, రైలు ఢీకొట్టడంతో బలమైన గాయం తగిలి చనిపోయి ఉంటాడని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ డి. లలిత పేర్కొన్నారు.







