జట్టు వర్కర్లు పదవీ విరమణ

UPDATED 31st AUGUST 2018 FRIDAY 9:00 PM

సామర్లకోట: గత ముప్పై సంవత్సరాలుగా ఎఫ్.సి.ఐలో సేవలందించిన నలుగురు జట్టు వర్కర్లు శుక్రవారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఎఫ్.సి.ఐ కార్యాలయంలో నిర్వహించిన వీడ్కోలు సభకు ముఖ్య అతిధులుగా ప్రముఖ పారిశ్రామికవేత్త దవులూరి దొరబాబు, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వల్లూరి సూరిబాబు, ఉపాధ్యక్షుడు చింతల శ్రీను, గుమ్మళ్ల రామకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గుమ్మళ్ల సాయి, మద్దుకూరి మురళీ, పెనుమర్తి సత్తిరాజు, గద్దె కృష్ణ, టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షుడు చల్లా బుజ్జి,  ఎఫ్.సి.ఐ డిపో మేనేజర్, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us