* హోంశాఖా మంత్రి నిమ్మకాయల చినరాజప్ప
* ఆర్.బి. పట్నంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
UPDATED 29th SEPTEMBER 2018 SATURDAY 7:00 PM
పెద్దాపురం: గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంశాఖా మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. మండల పరిధిలోని రాయభూపాలపట్నం గ్రామంలో రూ. 2 కోట్ల 31 లక్షల 80 వేలు విలువ గల అభివృద్ధి పనులకు ఆయన శనివారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఎస్సీ పేటలో రూ. కోటితో సిసి రోడ్లు, రూ. కోటితో రాయభూపాలపట్నం నుంచి మర్రిపూడి బిటి రోడ్డుకు రూ. 8 లక్షలతో నిర్మించిన సిసి రోడ్డుకు మంత్రి శంకుస్థాపన చేశారు. అలాగే రూ.16 లక్షల 80 వేలుతో నిర్మించిన పశువైద్య ఆసుపత్రి, రూ.7 లక్షలతో నిర్మించిన అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం శ్రీ లలితా ఇండస్ట్రీస్ ప్రైవేటు లిమిటెడ్ సమకూర్చిన డస్ట్ బిన్స్, అలాగే సైరస్ ఇండస్ట్రీస్ సమకూర్చిన పారిశుద్య వాహనాన్ని మంత్రి చేతుల మీదుగా గ్రామానికి అందచేశారు. అలాగే గ్రామానికి చెందిన 29 మందికి ఇళ్ళ పట్టాలను అంద చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ గ్రామాల అభివృద్దికి శాసనసభ్యుడుగా, మంత్రిగా కృషి చేస్తున్నానని, ఈ గ్రామంలో ఇప్పటి వరకు రూ. మూడున్నర కోట్లతో అభివృద్ధి పనులకు చేపట్టడం జరిగిందని, ఈ రోజు రూ. 2 కోట్లతో రోడ్లు శంకుస్థాపన చేశామని చెప్పారు. ఏఎంసీ చైర్మన్ ముత్యాల రాజబ్బాయి కోరిక మేరకు అన్ని పనులు పూర్తి చేస్తున్నట్లు చెప్పారు. సబ్ సెంటర్ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తానని, వాటర్ ప్రతిపాదనలు పంపించామని, మెయిన్ కాలువ నుంచి ప్రతిపాదనలు ఇచ్చారని, దానిని కూడ కృషి చేస్తానని, బ్రిడ్జి ఏర్పాటుకు సంబంధించి అధికారులతో సంప్రదిస్తానని తెలిపారు. పార్టీలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ ముత్యాల రాజబ్బాయి మాట్లాడుతూ మంత్రివర్యులు చినరాజప్ప ఈ గ్రామానికి సుమారు రూ. 6 కోట్లుతో అభివృద్ధి పనులు మంజూరు చేయించారని తెలిపారు. నా జీవితాశయాలైన కళ్యాణ మండపం, బ్రిడ్జి, వాటర్ ట్యాంకు, ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి మంత్రి కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సుందరపల్లి శివనాగరాజు, ఏఎంసి వైస్ చైర్మన్ ఆచంట రాజన్న(రాజబాబు), తహసీల్దార్ గంగుమళ్ల బాలసుబ్రహ్మణ్యం, టిడిపి మండలాధ్యక్షుడు కొత్తెం వెంకట శ్రీనివాసరావు(కోటి), లలితా సైరస్ ఇండస్ట్రీస్ అధినేతలు మట్టే శ్రీనివాస్, సూరిబాబు, టిఎన్ఎస్ఎఫ్ ఉపాధ్యక్షుడు ముత్యాల మణికంఠ, ఎంపీటీసీ కల్తూరి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.







