డిప్యూటీ సీఎం ఆళ్ళ నానిని కలిసిన ఆరోగ్యమిత్రలు

UPDATED 23rd AUGUST 2019 FRIDAY 6:00 PM

కాకినాడ (రెడ్ బీ న్యూస్) : రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆరోగ్య శాఖా మంత్రి, జిల్లా ఇంఛార్జ్ మంత్రి ఆళ్ల నానిని ఆరోగ్య మిత్రలు కాకినాడ డీయం& హెచ్ఓ కార్యాలయంలో శుక్రవారం కలుసుకున్నారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, అలాగే వేతనాలు పెంచాలని విన్నవించారు. తమకు మూడు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని, దీంతో తామంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఆయనకు తెలియజేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ ఆరోగ్య మిత్రలకు ఉద్యోగ భద్రతను కల్పించడంతోపాటు, వేతనాలను పెంచుతామని హామీ ఇచ్చారు. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకానికి మరింత మంచి పేరు తీసుకువచ్చేలా ఆరోగ్య మిత్రలు కృషి చేయాలని సూచించారు. అలాగే రాష్ట కాపు కార్పోరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా, కాకినాడ ఎంపీ వంగా గీతకు వినతి పత్రాలను అందచేశారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య మిత్ర సంఘ నాయకులు రాయ్, వీరభద్రరావు, బంగారుశ్రీ, కళ్యాణి, జ్యోతి, సత్యవతి మురళి, వాణి రామారావు, శివ, ఖాజా, తదితరులు ఉన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us