UPDATED 2nd FEBRUARY 2019 SATURDAY 5:30 PM
పెద్దాపురం: అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఎంఎల్సీ ఎన్నికల్లో ఓటుహక్కు కలిగి ఉండేలా అన్ని రాజకీయ పార్టీలు, ఉపాధ్యాయ సంఘాలు సహకరించాలని పెద్దాపురం తహసీల్దార్ గంగుమళ్ల బాలసుబ్రహ్మణ్యం అన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఆయన రాజకీయ పక్షాల నాయకులు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో ఎంఎల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రత్యేక సమావేశం శనివారం నిర్వహించారు. ఉభయ గోదావరి జిల్లా పట్టభద్రుల ఎంఎల్సీ ఎన్నికలు త్వరలో జరగనుండడంతో ఆ ఎన్నికల కోసం ఓటు నమోదుకు ఈనెల 10వ తేదీ వరకు గడువు ఉందని అన్నారు. అర్హత గల ప్రతీ ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలన్నదే ఎన్నికల కమీషన్ ప్రధాన ఉద్దేశ్యమన్నారు. 2015 అక్టోబరు 31వ తేదీ నాటికి డిగ్రీ పూర్తి చేసి ఉండాలని, పూర్తి చేసిన డిగ్రీ పట్టా లేదా ప్రొవిజనల్ కాపీని గెజిటెడ్ అధికారి ధృవీకరణతో పాటు ఆధార్, ఓటరుకార్డు నకళ్లు జతపర్చి ధరఖాస్తు తహసీల్దార్ లేదా మండల పరిషత్, మండల విద్యాశాఖాధికారి, మున్సిపల్ కార్యాలయాల్లో గడువు లోపుగా అందచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ కృష్ణారావు, ఎలక్షన్ డిటి కృష్ణ, వివిధ పార్టీల నాయకులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.







