UPDATED 11th NOVEMBER 2017 SATURDAY 6:00 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో మెకానికల్ విభాగం అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందికి రెండు రోజులు పాటు నూతన ఆవిష్కరణలపై నిర్వహించిన వర్క్ షాప్ శనివారం ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా కళాశాల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి ముగింపు కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. డాక్టర్ శ్రీహరి నేతృత్వంలో ఎక్స్ పెరిమెంటల్ టెక్నిక్స్ ఇన్ వెల్డింగ్ టెక్నాలజీ అనే అంశంపై పలు సూచనలు, సలహాలు తమ అధ్యాపక, సిబ్బందికి తెలియచేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. నూతన ఆవిష్కరణలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ద్వారా తమ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు మరింత మెరుగైన విద్యాబోధనను తమ కళాశాల అధ్యాపకులు అందిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, మెకానికల్ విభాగం విభాగాధిపతులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.







