గ్రామాల్లో కేంద్ర బృందం పర్యటన

UPDATED 1st DECEMBER 2020 TUESDAY 9:00 PM

పెద్దాపురం (రెడ్ బీ న్యూస్): నివర్ తుఫాన్ కారణంగా కలిగిన పంట నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం మండల పరిధిలోని జి.రాగంపేట, వడ్లమూరు గ్రామాల్లో మంగళవారం పర్యటించింది. బృంద సభ్యులైన అమ్జాద్ ఖాన్ (పాట్నా), నవీన్, జి. కిరణ్ కుమార్ (హైదరాబాద్), ఏకే రాయ్ (కలకత్తా), ప్రభాకరం (బెంగళూరు), వాసుదేవ కుమార్ (పూణే) రైతులు, వ్యవసాయశాఖ అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రంగు మారిన, తడిసిన ధాన్యం నమూనాలను సేకరించారు. వీటన్నింటినీ పరిశీలించిన తరువాత ప్రభుత్వానికి నివేదికను అందజేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ డీడీ మాధవరావు, ఏడీఏ రత్న ప్రశాంతి, ఏవో ప్రశాంతి, ఎఫ్ సిఐ  మేనేజర్ రాజా, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us