* ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు నల్లా రామారావు
UPDATED 3rd OCTOBER 2020 SATURDAY 6:00 PM
పెద్దాపురం (రెడ్ బీ న్యూస్): జట్టు కూలీ రేట్లు పెంచకపోతే జిల్లావ్యాప్తంగా ఆందోళన చేపడతామని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు నల్లా రామారావు పేర్కొన్నారు. ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు తాటిపాక మధు, పిఎస్ నారాయణ అధ్యక్షత స్థానిక జట్టు వర్కర్ల యూనియన్ భవనంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కరోనాను సాకుగా చూపి వ్యాపారవర్గాలు జట్టు కూలీ రేట్లు పెంచకపోవడం అన్యాయమని, గతంలో మాదిరిగానే వ్యాపారాలు సాగుతున్నప్పటికీ కూలీ రేట్లు పెంచమంటే మాత్రం కరోనా వంక చెబుతున్నారని విమర్శించారు. ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఇప్పటికే రెవిన్యూ, కార్మిక శాఖల అధికారులకు వినతిపత్రాలు ఇవ్వడం జరిగిందని ఆయన అన్నారు. భవన నిర్మాణ కార్మికులకు తక్షణమే పదివేల రూపాయలు జమ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు రామకృష్ణ, తాతారావు, గుళ్ళు రాజు, బట్ట త్రిమూర్తులు, గండిశెట్టి శ్రీను, తదితరులు పాల్గొన్నారు.







