UPDATED 22nd JANUARY 2019 TUESDAY 6:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యా సంస్థల ప్రాంగణంలో గల ఇంజనీరింగ్, ఫార్మసీ, పాలిటెక్నిక్, బిజినెస్ మేనేజ్ మెంట్ కళాశాలల విద్యార్థులకు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో ఆయా గ్రంధాలయ శాఖల ఆధ్వర్యంలో వక్తృత్వ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిత్య క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు అనేది అత్యంత శక్తివంతమైన ఆయుధమని, దానిని అందరూ తప్పక ఉపయోగించుకోవాలని అన్నారు. ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా పెద్ద ఎత్తున ప్రచారం జరగాలని, ప్రభుత్వ, ప్రయివేటు రంగ సంస్థలు పూర్తి సహకారం అందించి ఓటర్లందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని ఆయన సూచించారు. ఈ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి పోటీలలో గెలుపొందిన విజేతలను జిల్లాస్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందని, జిల్లాస్థాయిలో గెలుపొందిన వారు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయబడతారని గ్రంధాలయాధికారి కె. అశోక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన గ్రంధాలయాధికారి కె. అశోక్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సముద్రాల జగదీష్, వివిధ గ్రంధాలయాధికారులు, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.







