జాతీయ భద్రతా పురస్కారానికి ఎంపికైన రిలయన్స్ పవర్

UPDATED 20th AUGUST 2017 SUNDAY 8:00 PM

సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట ఎడిబి రహదారిలో ఉన్నరిలయన్స్ పవర్ కు చెందిన సాసన్ పవర్ అత్యంత ప్రతిష్టాత్మకమైన జాతీయ భద్రతా పురస్కారం (మైన్స్) ఎంపికైనట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2013-14, 2014 -15 సంవత్సరానికి దీన్ని ఎంపిక చేసినట్లు వారు పేర్కొన్నారు. ఈ అరుదైన అవార్డును భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా సంస్థ హోల్ టైమ్ డైరెక్టర్ ఎం. వేణుగోపాల్ రావు స్వీకరించినట్లు వారు పేర్కొన్నారు. తమ సంస్థకు ఇటువంటి గొప్ప పురస్కారం లభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో కేంద్ర కార్మిక శాఖా మంత్రి బండారు దత్తాత్రేయతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us