UPDATED 6th JANUARY 2019 SUNDAY 9:00 PM
పెద్దాపురం: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య డిగ్రీ కళాశాల ఫోరెన్సిక్ సైన్స్ ఎన్ఎస్ఎస్ విభాగం, ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి ఆధ్వర్యంలో పెద్దాపురం మండలం ఆనూరు గ్రామంలో రెండవ రోజు కొనసాగుతున్న ప్రత్యేక ఆరోగ్య శిబిరంలో భాగంగా వాలంటీర్లు గ్రామంలో పర్యటించి గ్రామస్థులకు ఉచిత దంత పరీక్షలు నిర్వహించారు. రాయల్ డెంటల్ క్లినిక్ (కాకినాడ)కు చెందిన రూట్ కెనాల్ స్పెషలిస్ట్ డాక్టర్ యు. సత్యనారాయణ సౌజన్యంతో ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ ఇ. మోహన్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ టి. ప్రవీణ్ ప్రారంభించారు. అలాగే ఈ శిబిరానికి 60 మందికి పైగా గ్రామస్థులు హాజరయ్యారని, దంతాలకు సంబంధించిన పెద్ద సమస్యలు ఉన్నవారికి కాకినాడలో గల రాయల్ డెంటల్ ఆసుపత్రిలో అతి తక్కువ ఖర్చుతో చికిత్స చేయడం జరుగుతుందని క్యాంపు ప్రతినిధులు తెలిపారు.







