గ్రామాల్లో ఏరులై పారుతున్న నాటుసారా

* గ్రామాల్లో సారా కల్లోలం

* ఫిర్యాదు చేసినా స్పందించని అధికారులు

* మొక్కుబడిగా ఎస్ఈబీ అధికారుల దాడులు

* సారా వ్యాపారులతో కొంతమంది సిబ్బంది కుమ్మక్కు

UPDATED 25th AUGUST 2020 TUESDAY 8:00 PM

పెద్దాపురం (రెడ్ బీ న్యూస్):  పెద్దాపురం మండల పరిధిలోని పలు గ్రామాల్లో నాటుసారా ఏరులై పారుతున్నట్లు పలువురు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నాటుసారాను నియంత్రించడంలో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు పూర్తిగా విఫలం అయ్యారని ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు ఆరోపిస్తున్నారు. నాటుసారా తయారీకి కేరాఫ్ అడ్రస్ గా కాండ్రకోట, మర్లావ గ్రామాలు తయారయ్యాయని ఆయా గ్రామాల ప్రజలు చెబుతున్నారు. అలాగే రంగంపేట మండలం మర్రిపూడి గ్రామం నుంచి పెద్దాపురం మండలం చిన బ్రహ్మదేవం గ్రామంలోకి సారాను తీసుకువచ్చి కొంత మంది వ్యాపారులు గ్రామంలో పలు ప్రాంతాల్లో విక్రయాలు సాగిస్తున్నారని, దీంతో గ్రామంలో అశాంతి పెరుగుతున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. సారా కారణంగా గతంలో పలు ఘర్షణలు, హత్యలు సైతం జరగడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా గ్రామంలో మేడపాడు వెళ్ళే దారి, దుర్గమ్మ ఆలయం పాత ఊరు, కొత్త ఊరు తదితర ప్రాంతాల్లో ఈ సారా అమ్మకాలు యథేచ్ఛగా సాగుతున్నట్లు పలువురు చెబుతున్నారు. అలాగే కొందరు పట్టపగలే ఇళ్ళలో సారాను అమ్మకాలు సాగిస్తున్నారన్నారు. ఈ విషయంపై స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులకు తెలియచేసినా పట్టించుకోవడంలేదని కారణం ఏమిటో వారికే తెలియాలని అధికారుల తీరుపై పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే కొంత మంది అధికార సిబ్బంది వ్యాపారులకు సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో వ్యాపారులు అధికారులు వచ్చేలోపు పరారవుతున్నారని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us