UPDATED 21st DECEMBER 2018 FRIDAY 9:00 PM
సామర్లకోట: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు శుక్రవారం పట్టణ, మండల పరిధిలోని గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక స్టేషన్ సెంటర్లో పెద్దాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు ఆధ్వర్యంలో 25 కేజీల భారీ కేకును కట్ చేశారు. అనంతరం స్థానిక సిరి మానసిక దివ్యాంగుల పాఠశాల విద్యార్థులు, ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్లు, అలాగే మండల పరిధిలోని గొంచాల గ్రామంలో పేదలకు దుప్పట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా దొరబాబు మాట్లాడుతూ వైఎస్ జగన్ మోహనరెడ్డి ప్రకటించిన నవరత్నాలు గురించి ప్రచారం చేసి వాటి ద్వారా చేకూరే లబ్ధిని ప్రజలకు తెలియజేయాలని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన నాటి నుంచి నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతున్న ఏకైక నాయకుడు మన పార్టీ అధ్యక్షుడు జగన్ అని, వచ్చే ఎన్నికల్లో జగన్ ను ముఖ్యమంత్రి చేసే వరకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. అనంతరం పెద్దాపురం మండలం పులిమేరు గ్రామంలో గల శాంతివర్ధన మానసిక దివ్యాంగుల పాఠశాలలో జగన్ జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా దొరబాబు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఈ పాఠశాలలో జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా ప్రతీ సంవత్సరం రూ. లక్ష రూపాయలు ఆర్థిక సహాయంగా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అలాగే దవులూరి సుబ్బారావు రూ.పది వేలు, కౌన్సిలర్ ఆవాల లక్ష్మీ నారాయణ రూ.మూడు వేలు ఆర్థిక సహాయంగా ఇవ్వడం జరిగింది. అలాగే జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినం సందర్భంగా పాత తహసీల్దార్ కార్యాలయం వద్ద చిత్తూరి లక్ష్మణరావు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి వెంకటప్పారావు చౌదరి, సొసైటీ అధ్యక్షుడు కొప్పిరెడ్డి రాధాకృష్ణ, కార్మిక సంఘం నాయకులు దవులూరి సుబ్బారావు, పార్టీ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు మద్దాల శ్రీను, సేపేని సురేష్, కౌన్సిలర్లు ఊబా జాన్ మోజస్, ఆవాల లక్ష్మీనారాయణ, కాళ్ళ లక్ష్మీనారాయణ, మాజీ కౌన్సిలర్ నేతల హరిబాబు, పితాని సూర్యనారాయణ, వాసంశెట్టి గంగ, జిల్లా కార్యదర్శులు మేకా శ్రీను, ఆదపురెడ్డి శ్రీనివాసు, ఇనుకొండ విష్ణుచక్రం, పెద్దాపురం పట్టణ అధ్యక్షుడు కాపుగంటి కామేశ్వరరావు, తాటికొండ అచ్చిరాజు, మేడిశెట్టి వీరభద్రం, జోగారావు నరేష్, ఉబేదుల్లా, గోకిన రాజు, కానుబొయిన విజయకృష్ణ, జుత్తుక అప్పారావు తదితరులు పాల్గొన్నారు.







