వ్యక్తిగత సామర్ధ్యాలే విజయసోపానాలు

UPDATED 19th AUGUST 2017 SATURDAY 6:00 PM

పెద్దాపురం: ప్రతీ వ్యక్తిలోనూ అంతర్గతంగా దాగివున్న సామర్ధ్యాలను మెరుగుపరుచుకోవడం ద్వారానే అద్భుత విజయాలు సొంతమవుతాయని అంతర్జాతీయ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ లక్ష్మీపురం వేణుగోపాల్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం దివిలి కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ శర్మ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఫాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఆన్ సాఫ్ట్ స్కిల్స్ సదస్సుకు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ముందుగా కళాశాల చైర్మన్ బేతినీడి శ్రీనివాసరావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్యఅతిధిగా హాజరైన వేణుగోపాల్ మాట్లాడుతూ ఒక సంస్థ పనితీరు మెరుగు పడాలంటే అందులో సిబ్బంది మొత్తం ప్రజ్ఞావంతులై ఉండాలన్నారు. వ్యక్తిగత సామర్ధ్యాలను ఎప్పటికప్పుడు పెంపొందించు కుంటూ విజయపథంలో పయనించాలన్నారు. విద్యార్థుల్లో సామర్ధ్యాలను పెంపొందించేందుకు భోధన, పరిశోధన, విశ్లేషణాత్మక దృక్పథాలను అవలంబించాలన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శర్మ మాట్లాడుతూ ఇటువంటి స్కిల్ డెవలప్మెంట్ శిక్షణను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని అభివృద్ధి సాధించాలన్నారు. కళాశాల చైర్మన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలుతో కూడిన సామర్ద్యాభివృద్ధికి ప్రత్యేక శిక్షణ కల్పిస్తున్నామన్నారు. అనంతరం ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు అన్వర్ విద్యార్థులకు పలు విషయాల పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎవో  కె.ఆర్.సందీప్, ఈవో జెన్నిబాబు, ఏసీవో పెదకాపు, వీరేంద్ర, హెచ్వోడీలు దయాకర్, సర్వరామేశ్వరుడు, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.  

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us