సర్వమత సమానత్వం సమాజానికి శ్రేయస్కరం

* డాక్టర్ ఎన్.ఎం.డి. ఫరూక్  
* ఆదిత్య ప్రాంగణంలో ఘనంగా మసీదు ప్రారంభోత్సవం
UPDATED 20th AUGUST 2018 MONDAY 9:00 PM
గండేపల్లి: సర్వమత సమానత్వం సమాజానికి శ్రేయస్కరమని డాక్టర్ ఎన్.ఎం.డి. ఫరూక్ అన్నారు. గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన మసీదు ప్రారంభోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర శాసన మండలి గౌరవాధ్యక్షులు, మాజీ మంత్రి డాక్టర్ ఎన్.ఎం.డి. ఫరూక్ ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఫరూక్ మాట్లాడుతూ ఇస్లాం అంటే శాంతి అని, సర్వ మత గ్రంధాల సారాంశం శాంతి స్థాపనే అని అన్నారు. ఒక విద్యాసంస్థ ప్రాంగణంలో సర్వమతాలకు సమాన ప్రాధాన్యతను కల్పిస్తూ ఆయా మతాలకు చెందిన ప్రార్ధనా మందిరాలను నిర్మించడం ఎక్కడా చూడలేదని అన్నారు. ముస్లిం విద్యార్థుల కోసం మసీదు నిర్మించడం, ప్రార్థనలు చేసుకొనేందుకు వీలుగా ఏర్పాట్లు చేయడం, రోజూ ఐదు సార్లు నమాజ్ చేసేందుకు ఇమామ్ ను నియమించిన ఆదిత్య యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమానికి హాజరుకావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి మాట్లాడుతూ బాల్యం నుంచి తల్లితండ్రులు తమ పిల్లలను వారివారి ప్రార్థనా మందిరాలకు తీసుకునివెళ్లాలని, వారికి సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేయాలన్నారు. గురువులపట్ల, పెద్దలపట్ల భక్తి, గౌరవభావాన్ని పెంపొందింపచేయాలని కోరారు. తమ సంస్థ విద్యార్థులకు విద్యతో పాటు వారి యొక్క ఆధ్యాత్మిక సంస్కృతీ, సంప్రదాయాలు, సర్వమత సమానత్వం విద్యార్థులకు అలవర్చాలనే సత్ సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. జిల్లాలో గల వివిధ మసీదులకు చెందిన ఇమాంలు, మత పెద్దలు, ముస్లిం సోదరులు పెద్దఎత్తున తరలివచ్చారు. అనంతరం ఆదిత్య యాజమాన్యం ముఖ్య అతిధిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య విద్యాసంస్థల జనరల్ సెక్రటరీ లక్ష్మీరాజ్యం, డైరెక్టర్స్ ఎన్. శృతిరెడ్డి, డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి, వివిధ మసీదులకు చెందిన మత పెద్దలు, ఇమాంలు, తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us