గణితచదరంతో ఆంధ్రకేసరికి ఘన నివాళి

UPDATED 22nd AUGUST 2017 TUESDAY 10:00 PM

సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పట్టణానికి చెందిన తోటకూర సాయివంశీ ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 146 వ జయంతిని పురస్కరించుకుని ఎటుకూడినా 146 వచ్చేవిధంగా మాయా చదరాన్ని(మేజిక్ స్క్వేర్) రూపొందించి ఆయనకు వినూత్ననంగా నివాళులు తెలిపాడు. ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు జయంతిని రాష్ట్ర పండుగగా తలపెట్టిన సందర్భంగా ఈ మేజిక్ స్క్వేర్ ను రూపొందించినట్లు తెలిపాడు. కాకినాడ ఆదిత్య స్కూల్ లో 10 వ తరగతి చదువుతున్న సాయి వంశీని ఈ సందర్భంగా సంస్థ సెక్రటరీ ఎన్. దీపక్ రెడ్డి, డైరెక్టర్ ఎన్. శృతి, ప్రిన్సిపాల్ రమణి, ప్రముఖ గణితావధాని తోటకూర సాయి రామకృష్ణ తదితరులు అభినందించారు.         

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us