UPDATED 10th JUNE 2018 SUNDAY 9:00 PM
సామర్లకోట: తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ పట్టణంలో జరగనున్న దళిత సింహగర్జన సదస్సుకు సామర్లకోట, పెద్దాపురం తదితర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున రైలులో ఆదివారం తరలి వెళ్లారు. ఈ సందర్భంగా స్థానిక రైల్వే స్టేషన్లో విలేఖరులతో మాట్లాడుతూ దళితుల ఐకమత్యాన్ని చాటేందుకు నిర్వహిస్తున్న ఈ సదస్సు విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కాళ్ల లక్ష్మీనారాయణ, నందిక చక్రం, వల్లూరి నాని, వల్లూరి సత్యవతి, పోసపల్లి వెంకట్రావు, మందపల్లి రుద్రయ్య, గోరింట అప్పారావు, దుళ్లపల్లి రమణ, మంజేటి డేవిడ్ రాజు, కాకాడ నూకరాజు, తదితరులు పాల్గొన్నారు.







