ఆదిత్య అసోసియేట్ ప్రొఫెసర్ జితేంద్రకు డాక్టరేట్

UPDATED 3rd DECEMBER 2020 THURSDAY 8:00 PM

గండేపల్లి (రెడ్ బీ న్యూస్): గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యా సంస్థల ప్రాంగణంలో గల ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్ మానవ వనరుల విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్న జి. జితేంద్ర శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ (తిరుపతి) నుంచి డాక్టరేట్ పొందినట్లు ఆదిత్య గ్లోబెల్ బిజినెస్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ నల్లమిల్లి సుగుణారెడ్డి తెలిపారు. రిటైర్డ్ ప్రొఫెసర్ బి. సురేష్ రావు పర్యవేక్షణలో తాను సమర్పించిన "పెర్సివింగ్ ది ఎఫెక్ట్ ఆఫ్ హెచ్.ఆర్.డి ప్రాక్టీసెస్ ఆన్ ఎంప్లాయిస్ పెర్ఫార్మెన్స్ ఇన్ టెక్స్ టైల్ ఇండస్ట్రీ అఫ్ ఆంధ్రప్రదేశ్" అను పరిశోధనా పూర్వక గ్రంథానికి డాక్టరేట్ పొందినట్లు తెలిపారు. మానవ వనరుల విభాగంలో టెక్స్ టైల్స్ రంగంలో ఉద్యోగుల పనితీరును అంచనా వేయు పద్దతులను ఆయన తన గ్రంథంలో కూలంకషంగా విపులీకరించారు. డాక్టర్ జితేంద్ర తన క్రమశిక్షణ, నిరంతర కృషి, విజ్ఞానంతో మరింత మందికి మార్గదర్శకంగా నిలవాలని, విద్యార్థులకు చక్కటి మార్గనిర్దేశికత్వం చేస్తూ ఉన్నతస్థాయికి చేరుకోవాలని ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి, డైరెక్టర్ డాక్టర్ సుగుణారెడ్డి,  ప్రిన్సిపాల్ డాక్టర్ డి. ఆస్ధాశర్మ, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, తదితరులు ఈ సందర్భంగా ఆయనను అభినందించారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us