ఆక్రమణ స్థలాలు క్రమబద్ధీకరణకు అవకాశం

UPDATED 4th FEBRUARY 2020 TUESDAY 6:00 PM

కాకినాడ(రెడ్ బీ న్యూస్): జిల్లాలో ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని నివాసముంటూ ఎలాంటి  అభ్యంతరాలు లేని స్థలాలను క్రమబద్దీకరించుకొనే అవకాశం కల్పిస్తున్నట్లు జిల్లా జాయింట్ కలక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 463 నెంబరుతో జారీ చేసిన జీవో ప్రకారం గత సంవత్సరం అక్టోబరు నెల 15వ తేదీ వరకు ఆక్రమించుకున్న స్థలాల క్రమబద్దీకరణ కోసం తమ సమీపంలో గల మీసేవా కేంద్రాలు, గ్రామ సచివాలయాలలో తమ రేషన్ కార్డు, ఆధార్ కార్డులతో నమోదు చేసుకోవచ్చని, దీనిపై ఏమైనా సందేహాలుంటే స్థానిక గ్రామ సచివాలయాలతో పాటు తహసీల్దార్, ఆర్డీవో, జిల్లా కలక్టర్ కార్యాలయాల్లో సంప్రదించాలన్నారు. దారిద్ర్యరేఖకు దిగువనున్న వారు 100 గజాలు స్థలం ఆక్రమించుకుని ఉంటే కేవలం ఒక్క రూపాయితో, 100 నుంచి 300 గజాలు స్థలాన్ని జిల్లా కలక్టర్ నిర్ణయంతో మార్కెట్ రేటు ప్రకారం రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని పేర్కొన్నారు. అలాగే దారిద్ర్యరేఖకు ఎగువున ఉన్న వారు 0 నుంచి 300 గజాలు స్థలం అయితే మార్కెట్ రేటు ప్రకారం జిల్లా కలక్టర్ వారి నిర్ణయంతో రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని ఆయన తెలిపారు. 

 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us