◆ జిల్లా కలెక్టర్ డాక్టర్ కృత్తికా శుక్లా
◆ డీఎంహెచ్‌వోపై కలెక్టర్ ఫైర్
UPDATED 11th APRIL 2022 MONDAY 9:00 PM
కాకినాడ (రెడ్ బీ న్యూస్) : స్పందన కార్యక్రమానికి డుమ్మాకొడితే సహించేది లేదని జిల్లా అధికారులను కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా హెచ్చరించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో డీఎంహెచ్‌వోపై కలెక్టర్ ఫైర్ అయ్యారు. స్పందన అంటే ఆషామాషీనా, మీరు రాకుండా దిగువస్థాయి సిబ్బందిని పంపడం ఏంటని డీఎంహెచ్‌వోపై సీరియస్ అయ్యారు.
జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి అర్జీలు ఇచ్చేందుకు అర్జీదారులు కలెక్టరేట్‌కు వస్తారు., జిల్లా అధికారులకు సమస్యను వివరించుకుందామనే కదా.. అలాంటిది మీరు లేకుండా ఎవరినో వేరే అధికారిని పంపించడం ఏంటని కలెక్టర్ సీరియస్ అయ్యారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమానికి 216 అర్జీలు వచ్చినట్లు ఆమె తెలిపారు.
స్పందన అర్జీల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని, నిర్ధిష్ట గడువులోగా సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలాక్కియా, డీఆర్‌వో కె. శ్రీధర్‌రెడ్డి, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎస్‌వీవీఎస్ సుబ్బలక్ష్మి, ఈ-గవర్నెన్స్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.







