UPDATED 9th DECEMBER 2018 SUNDAY 9:00 PM
పెద్దాపురం: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య డిగ్రీ కళాశాల ఫోరెన్సిక్ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం విద్యార్థులు అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవం సందర్భంగా పెద్దాపురం మండలం ఆనూరు గ్రామంలో ఆదివారం అవగాహనా ర్యాలీ నిర్వహించారు. అవినీతి అరికట్టండి-సమాజాన్ని కాపాడండి, లంచం వద్దు-మంచిపాలన ముద్దు అంటూ గ్రామంలో విద్యార్థులు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఫోరెన్సిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఇ. మోహన్ గ్రామ ప్రజలతో మాట్లాడుతూ లంచం తీసుకోవడం, ఇవ్వడం రెండూ నేరమని, అవినీతిని అరికట్టేందుకు ప్రతీ ఒక్కరూ సహకరించాలని, అవినీతి లేని సమాజాన్ని భావితరాలకు అందించేందుకు మనమంతా కృషి చేయాలని అన్నారు. ఈ సందర్భంగా ఆదిత్య బిజినెస్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి, ఫోరెన్సిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఇ. మోహన్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్స్ ఎం. గోవర్ధనరెడ్డి, టి. ప్రవీణ్, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.







