ప్రభుత్వ పాఠశాలలు బలోపేతానికి ప్రభుత్వం కృషి

UPDATED 5th JULY 2019 FRIDAY 9:00 PM

సామర్లకోట: రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలు బలోపేతానికి విశేషంగా కృషి చేస్తున్నట్లు పట్టభద్రుల ఎంఎల్సీ ఇళ్ళ వెంకటేశ్వరరావు అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మండల విద్యాశాఖాధికారి వైవి శివరామకృష్ణయ్య అధ్యక్షతన శుక్రవారం జరిగిన అభినందన సభలో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎంఎల్సీ ఇళ్ళ వెంకటేశ్వరరావు ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. అమ్మఒడి పథకాన్ని పూర్తిగా ప్రభుత్వ యాజమాన్యంలోని విద్యార్థులకు కల్పించడమే కాకుండా, పాఠశాలలో విద్యార్థులను సంఖ్యను పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ మండల శాఖ అధ్యక్ష, కార్యదర్శులు ఆర్. శ్రీనివాస్, ఏ. తాతబ్బాయి, యూటీఎఫ్ సామర్లకోట పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు కె. కృష్ణమూర్తి, కె. వీరన్న, ఎస్టీయు అధ్యక్ష, కార్యదర్శులు ఎన్.ఎ. శ్రీరామచంద్రమూర్తి, ఎన్. అర్జునకుమార్, విశ్రాంత ఉపాధ్యాయులు బి. అశోక్ గిరిధర్, మండల పరిషత్ ఆఫీస్ సూపరిండెంట్ శ్రీనివాస్, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు..

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us