UPDATED 17th SEPTEMBER 2019 TUESDAY 6:00 PM
గండేపల్లి (రెడ్ బీ న్యూస్) : గండేపల్లి మండలం సూరంపాలెంలోని ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలలో ఈనెల 26,27 తేదీలలో రెండు రోజులపాటు జరిగే జాతీయస్థాయి సాంకేతిక సదస్సు "స్ట్రైడ్స్-2కె19 " పోస్టరును కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థినీ, విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచుకునేందుకు ఈ కార్యక్రమం ఒక చక్కని అవకాశమని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శంభుప్రసాద్ మాట్లాడుతూ 2009వ సంవత్సరం నుంచి ప్రతీ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈ సంవత్సరం కూడా విద్యార్థులు తమ ప్రతిభను చాటి చెప్పే విధంగా పేపర్లు, పోస్టర్లు, ప్రాజెక్ట్ డిస్ ప్లే వంటి ఈవెంట్స్ తో స్ట్రైడ్స్- 2కె19ని విజయవంతం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. స్ట్రైడ్స్-2కె19 కన్వీనర్, ఇసిఇ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ డి. నగేష్ సాంకేతిక కార్యక్రమం వివరాలను తెలియజేస్తూ, సెప్టెంబర్ 26వ తేదీన ట్రిపుల్ ఈ, సివిల్ ఇంజనీరింగ్, సెప్టెంబర్ 27వ తేదీ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాలకు చెందిన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పేపర్ ప్రెజంటేషన్స్, పోస్టర్ ప్రెజంటేషన్స్, మోడల్ ఎక్స్ పో, టెక్నికల్ క్విజ్, ప్రొజెక్ట్ డిస్ ప్లే, స్పాట్ ఈవెంట్స్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరక్టర్ మేనేజ్ మెంట్ ఎం.వి. హరనాధబాబు, డైరక్టర్ డాక్టర్ జి. రఘురాం, వైస్ ప్రెసిడెంట్ ఎం. సతీష్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. సత్యనారాయణ, డీన్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ జి. నరేష్, అకడమిక్ కమిటీ మెంబర్స్, వివిధ విభాగాధిపతులు, సీనియర్ అధ్యాపకులు, అధ్యాపకులు, విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.







