UPDATED 28th JANUARY 2018 SUNDAY 9:00 PM
సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం జి.మేడపాడు గ్రామంలో రాష్ట్ర స్థాయి ఎడ్లబండి పరుగు పోటీలు చాలా ఉత్సాహంగా సాగాయి. ప్రముఖ పారిశ్రామికవేత్త దవులూరి దొరబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలను రైతు సంఘం నాయకుడు మోరంపూడి శ్రీరంగనాయకులు ప్రారంభించారు. ఈ పోటీల్లో నాలుగు జిల్లాలకు చెందిన 34 జతలు ఎడ్లబళ్ళు పాల్గొన్నాయి. ఈ పోటీల్లో తూర్పుగోదావరి జిల్లాకు మూడు, కృష్ణా జిల్లాకు రెండు బహుమతులు దక్కాయి. అనంతరం ప్రముఖ పారిశ్రామికవేత్త దవులూరి దొరబాబు మాట్లాడుతూ ఎడ్లబండి పోటీలు ఈ గ్రామంలో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి కాకినాడ పార్లమెంటరీ నియోకవర్గ ఇంఛార్జ్ కురసాల కన్నబాబు, పెద్దాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ తోట సుబ్బారావునాయుడు, కౌన్సిలర్ జాన్ మోజెస్, అడబాల సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.







