UPDATED 11th FEBRUARY 2019 MONDAY 7:00 PM
పెద్దాపురం: పెద్దాపురం తహసీల్దారుగా కలగర గోపాలకృష్ణ సోమవారం భాద్యతలు స్వీకరించారు. కృష్ణా జిల్లా గన్నవరం తహసీల్దారుగా పనిచేస్తూ బదిలీపై ఆయన పెద్దాపురం వచ్చారు. ఇప్పటివరకూ తహసీల్దారుగా పనిచేసిన గంగుమళ్ల బాలసుబ్రహ్మణ్యం పశ్చిమగోదావరి జిల్లా ఆచంటకు బదిలీ అయ్యారు. నూతనగా బాధ్యతలు స్వీకరించిన గోపాలకృష్ణ గతంలో పశ్పిగోదావరి జిల్లా దెందులూరు డిప్యూటీ తహసీల్దారుగా, నాగాయలంక, బాపులపాడు ప్రాంతాల్లో తహసీల్దారుగా పనిచేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం తహసీల్దార్ గోపాలకృష్ణ ఆర్డీవో ఎన్.ఎస్.వి.బి. వసంతరాయుడుని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. నూతనంగా భాద్యతలు స్వీకరించిన తహసీల్దార్ గోపాలకృష్ణను పెద్దాపురం మండలం విఆర్వోలు, రెవెన్యూ సిబ్బంది కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు.







