కోడి పందాలు, జూదాలు నిర్వహిస్తే కఠిన చర్యలు

★ సబ్ కలెక్టర్ కట్టా సింహాచలం, ఏఎస్పీ కృష్ణకాంత్ పటేల్

గంగవరం (రెడ్ బీ న్యూస్) 7 జనవరి 2022 : సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామాల్లో కోడిపందాలు, జూదంవంటి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని రంపచోడవరం ఏఎస్పీ కృష్ణకాంత్ పటేల్, రంపచోడవరం సబ్ కలెక్టర్ కట్టా సింహాచలం హెచ్చరించారు.. తహశీల్దార్ శ్రీమన్నారాయణ ఆధ్వర్యంలో పలు శాఖల సిబ్బందితో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా కోడిపందాలు, జూదాల వైపు యువత వెళ్లకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వివిధ సంప్రదాయ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. అలాగే గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పల్లాల కృష్ణారెడ్డి, ఎస్ఐ చిన్నిబాబు, ఆర్ఐ జిలాని, వైస్ ఎంపీపీ గంగాదేవి, ఏఎస్సై రమణ, ఉపాధిహామీ, వెలుగు, పోలీస్, వైద్య ఆరోగ్య శాఖ, పశు వైద్య శాఖ సిబ్బంది, ఎన్జీవోలు, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us