UPDATED 12th FEBRUARY 2022 SATURDAY 10:20 AM
Earthquake: ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో ఫిబ్రవరి 12 శనివారం ఉదయం స్వల్ప భూకంపం సంభవించింది. ప్రకంపనలు స్వల్పంగా ఉండటంతో ప్రజలపై పెద్దగా ప్రభావం చూపించలేదు. అధికారిక సమాచారం ప్రకారం, తూర్పు ఉత్తరకాశీకి 39 కిలోమీటర్ల దూరంలోని ప్రాంతంలో ఉదయం 5గంటల 3నిమిషాలకు భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.1గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (NCS) తెలిపింది. ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లుగా ఎటువంటి వివరాలు నమోదుకాలేదు. ఉదయం 5గంటలకు చలి కారణంగా ప్రాంతవాసులంతా ఇళ్లలోనే ఉన్నప్పటికీ ఎటువంటి ఆస్తినష్టం, ప్రాణ నష్టం జరగలేదు. వారం రోజుల వ్యవధిలో ఉత్తరకాశీలో మూడోసారి మూడోసారి భూకంపం వచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి. గత ఆదివారం ఉదయం 11గంటల 27నిమిషాలకు 4.1 తీవ్రతో భూమి కంపించింది. అంతకుముందు ఫిబ్రవరి 5న కూడా 3.6 తీవ్రతతో భూకంపం వచ్చింది.







