Latha Mangeshkar:స్వర కోకిల లతా మంగేష్కర్ ఇకలేరు

UPDATED  6 FEBRUARY 2022  SUNDAY 09:50 AM

ముంబయి (రెడ్ బీ న్యూస్): స్వర కోకిలగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కన్నుమూశారు. ఆమె భారతరత్న, పద్మ విభూషణ్ అవార్డులు అందుకున్నారు. 92 ఏళ్ల లతా మంగేష్కర్ ఈరోజు ఉదయం తుది శ్వాస విడిచారు. జనవరి 8న లతా మంగేష్కర్‌కు కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. దీంతో ఆమెను ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో చేర్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆమె అభిమానులు లతా దీదీ త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేశారు. ఐసీయూలో ఉన్న ఆమెను వెంటిలేటర్‌కు తరలించారు. దాదాపు నెల రోజుల పాటు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడిన లతా మంగేష్కర్ చివరకు ఓడిపోయారు. ఈ వార్త తెలియగానే బాలీవుడ్ స్టార్స్ దిగ్భ్రాంతి చెందారు. సోషల్ మీడియాలో ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us