జీవితంలో యోగా ఒక భాగం కావాలి

UPDATED 3rd MARCH 2020 TUESDAY 6:00 PM

గండేపల్లి(రెడ్ బీ న్యూస్): జీవితంలో యోగా ఒక భాగం కావాలని ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల పిడి జి. దుర్గా ప్రసాద్ పేర్కొన్నారు. గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్  విభాగం ఆధ్వర్యంలో సూరంపాలెం గ్రామంలో నిర్వహిస్తున్న ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరంలో భాగంగా మంగళవారం గ్రామంలో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల పిడి దుర్గా ప్రసాద్ యోగా ప్రాముఖ్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రతీ రోజూ యోగా చేయడం వల్ల మానసిక ఒత్తిడి దూరమై ఆరోగ్యంగా ఉండవచ్చన్నారు. యోగా ద్వారా అనేక శారీరక రుగ్మతల నుంచి బయటపడవచ్చని, క్రమం తప్పకుండా యోగా చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్స్ పి.రాజశేఖర ఫణీంద్ర, బి. సుధీర్, ఎన్ఎస్ఎస్ విభాగం కోఆర్డినేటర్లు మోహన్, విద్యార్థులు ప్రమోద్, శశాంక్, చైతన్య, సూర్యనారాయణ, ముఖేష్ రెడ్డి, జ్యోతిర్మయి, స్నేహ, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us