జక్కంపూడి రాజా దీక్షకు తోట సంఘీభావం

UPDATED 3rd OCTOBER 2018 WEDNESDAY 9:00 PM

సామర్లకోట: రాజానగరం నియోజకవర్గ పరిధిలోని సీతానగరం మండలం రఘుదేవపురం గ్రామంలో రైతులకు న్యాయం చేయాలని కోరుతూ రైతు సత్యాగ్రహం పేరిట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా చేస్తున్న దీక్షకు పెద్దాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు బుధవారం సంఘీభావం తెలిపారు. ఈ మేరకు ఒంగోలు మాజీ పార్లమెంట్ సభ్యులు వై.వి.సుబ్బారెడ్డిని ఆయన కలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, జక్కంపూడి విజయలక్ష్మి, కర్రి పాపారాయుడు, మేడపాటి షర్మిలారెడ్డి, తదితరులు పాల్గొని సంఘీభావం తెలియజేశారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us