బ్రౌన్ పేటలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

UPDATED 14th APRIL 2018 SATURDAY 9:00 PM

సామర్లకోట: స్థానిక బ్రౌన్ పేటలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 127వ జయంతి  వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు, జనసేన నియోజకవర్గ నాయకుడు తుమ్మల రామస్వామినాయుడు(బాబు) పాల్గొన్నారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి, పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి ఈ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం భాస్కర రామారావుని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఊబా జాన్ మోజెస్, మాజీ కౌన్సిలర్ నేతల హరిబాబు, మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి రొక్కం శ్యామ్ దయాకర్, అధిక సంఖ్యలో మాలమహానాడు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us