ముగిసిన ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్

UPDATED 23rd JUNE 2018 SATURDAY 9:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల విభాగం సూరంపాలెం గ్రామంలో నిర్వహిస్తున్న స్పెషల్ క్యాంప్ శనివారంతో ముగిసింది. ముగింపురోజు కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులకు ఉచిత బిపి చెకప్ శిబిరాన్నినిర్వహించి, తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి వివరించారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ బి. సుధీర్ మాట్లాడుతూ వారం రోజులపాటు నిర్వహించిన ఈ క్యాంప్ లో ఆధార్ కార్డ్, వృద్ధాప్య పింఛను, సర్వే, బడి మానిన పిల్లలని బడిలో చేరమని కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి సహకారంతో కంటి వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం స్వచ్ఛభారత్ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కె. రాజాబాబు, చినబాబు, తమ్మయ్య, ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్ఎం గోపాలకృష్ణ, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.  
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us