UPDATED 17th NOVEMBER 2018 SATURDAY 5:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ఈనెల 15,16 తేదీల్లో రెండు రోజులపాటు నిర్వహించిన ఫ్యాకల్టీ డవలప్ మెంట్ కార్యక్రమం విజయవంతంగా ముగిసినట్లు ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ అనే అంశంపై ఈ వర్క్ షాప్ నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ వర్క్ షాప్ ప్రారంభ కార్యక్రమానికి ఎన్ఐటి సూరత్ కల్ కర్ణాటకకు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జ్ఞానశేఖర్ ముఖ్య అతిధిగా విచ్చేసి అధ్యాపకులకు దిశానిర్దేశం చేశారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న నేటి శాస్త్ర సాంకేతిక రంగాలలో మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకొని ముందుకు సాగాలని, అందుకు ఇటువంటి కార్యశాలలు ఏర్పాటు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. నేటి విద్యా విధానంలో అధ్యాపకులు నిరంతరం నేర్చుకొంటూ ఉంటేనే విద్యార్థికి సరైన రీతిలో భోదించే సామర్ధ్యం పెంపొందించుకోగలరని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ వల్లెం శ్రీనివాసరావు, విభాగాధిపతులు ప్రొఫెసర్ డాక్టర్ శరవణన్, డాక్టర్ వి. కామేష్, డాక్టర్ పి.ఎస్. రంజిత్, అధ్యాపక సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.







