విద్యార్థులకు సెల్ ఫోన్ ఇవ్వొద్దు

UPDATED 19th JULY 2018 THURSDAY 7:00 PM

పెద్దాపురం: విద్యార్థులకు సెల్ ఫోన్, అవసరానికి మించిన సొమ్ము ఇవ్వరాదని ఆర్డీవో ఎన్.ఎస్.వి.బి. వసంత రాయుడు అన్నారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఇటీవల జవహర్ నవోదయ విద్యాలయలో విద్యార్థుల మధ్య చెలరేగిన వివాదంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ఆర్డీవో గురువారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్డీవో వసంతరాయుడు మాట్లాడుతూ విద్యార్థులు స్నేహపూర్వకంగా తోటి విద్యార్థులతో మెలగాలే తప్ప, వివాదాలకు వెళ్ళరాదని హెచ్చరించారు. విద్యాలయాలు సరస్వతి నిలయాలని, ప్రతీ విద్యార్థికి క్రమశిక్షణ ఎంతో అవసరమని అన్నారు. మంచి ప్రవర్తన, ప్రతిభ ఆధారంగా నవోదయలో చదివే అవకాశం కలుగుతుందని, ఆ అవకాశం మీకు దక్కిందని, దీనిని విద్యార్థులు, తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. నవోదయ విద్యాలయంలో సిసి కెమెరాలు అమర్చాలని, ఉపాధ్యాయులు నిరంతరం విద్యార్థుల ప్రవర్తనను గమనించాలన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లలను వివాదాలకు దూరంగా ఉండేలాగ తరచూ వారికి విషయ పరిజ్ఞానాన్ని తెలియచేస్తూ ఉండాలన్నారు. తెలిసీ తెలియని వయస్సులో చేసిన పొరపాటును ర్యాగింగ్ గా చిత్రీకరించడం సరికాదన్నారు. ఈ సందర్భంగా గాయపడిన విద్యార్థి సుకుమార్ తండ్రి టి. సత్యానందం మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పోలీసు స్టేషనులో పెట్టిన కేసును ఉపసంహరించుకుంటున్నానని తెలిపారు. ఈ విచారణలో నవోదయ ప్రిన్సిపాల్ డాక్టర్ వి.  ముని రామయ్య, వైస్ ప్రిన్సిపాల్ డి.వి. రమణ, విద్యార్థులు, తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు. 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us