UPDATED 29th SEPTEMBER 2018 SATURDAY 8:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల కంప్యూటర్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డు సహకారంతో డీప్ లెర్నింగ్ ఫర్ బయో ఇంఫార్మేటిక్ అనే అంశంపై రెండురోజుల పాటు జరిగిన జాతీయస్థాయి వర్క్ షాప్ విజయవంతంగా ముగిసినట్లు కన్వీనర్, ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు తెలిపారు. రెండవరోజు కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఎన్ఐటి వరంగల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ డి.వి.ఎల్. సోమయాజులు, డాక్టర్ ఓంకార్ పెరుమాళ్ హాజరై మాట్లాడారు. విద్యారంగంలో నిరంతరాయంగా జరుగుతున్న మార్పులను, వేగంగా అభివృద్ధి చెందుతున్న విద్యాపరమైన ఆవిష్కరణలను తెలుసుకోవడానికి ఇటువంటి సదస్సులు ఎంతో మేలు చేస్తాయని అన్నారు. ఈ డీప్ లెర్లింగ్ ఫర్ బయో ఇంఫార్మేటిక్ టెక్నాలజీ ప్రస్తుతం అత్యాధునిక టెక్నాలజీ అని దీనిని నేర్చుకోవడం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. అనంతరం ముఖ్య అతిధులను ఆదిత్య యజమాన్యం తరుపున దుశ్శాలువా, జ్ఞాపిక పుష్పగుచ్చాలు అందించి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆదిరెడ్డి రమేష్, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎ. రామకృష్ణ, సిఎస్ఈ & ఐటి విభాగాధిపతులు ప్రొఫెసర్ ఎమ్. అనిల్ కుమార్, ప్రొఫెసర్ ఆర్. భీమారావు, డాక్టర్ ఆర్.వి.ఎస్. లలిత, తదితరులు పాల్గొన్నారు.







