ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు మెరుగైన వైద్య సేవలు

UPDATED 8th OCTOBER 2018 MONDAY 5:00 PM

పెద్దాపురం: ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు ఆర్డీవో ఎన్.ఎస్.వి.బి. వసంతరాయుడు పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ బొడ్డు బంగారుబాబు అధ్యక్షతన సోమవారం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆసుపత్రికి మంజూరైన నిధులు, వాటి వినియోగం, అలాగే ఆసుపత్రికి సమకూర్చుకోవలసిన మౌలిక  వసతులు, తదితర అంశాలపై ఆర్డీవో చర్చించారు. ఆసుపత్రిలో సిబ్బంది కొరత ఉందని ఆర్డీవో దృష్టికి తీసుకురాగా దీనికి ఆర్డీవో స్పందించి ఈ విషయాన్ని మంత్రి, జిల్లా కలెక్టరు దృష్టికి తీసుకురావడం జరుగుతుందని తెలిపారు. అలాగే మందులు స్టాకు వివరాలు, ఎమర్జన్సీ మందులు నిల్వలపై కూడా సమీక్షించారు. జిల్లాలో డెంగ్యూ వ్యాధి ప్రబలుతున్న దృష్ట్యా వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి వెంటనే వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నారు. అనంతరం ఆర్డీవో వార్డుల్లో ఉన్న రోగులను పరామర్శించి వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరాతీశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు డాక్టర్ రవికాంత్, డాక్టర్ దీపిక, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.  

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us