UPDATED 16th APRIL 2019 TUESDAY 9:00 PM
సామర్లకోట: సామర్లకోట రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో గల పిఠాపురం రైల్వే స్టేషన్ సమీపంలోని గుర్తు తెలియని సుమారు 65 సంవత్సరాలు వయస్సు గల గుర్తు తెలియని మహిళ కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీ కొట్టడంతో మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. సామర్లకోట రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతురాలు తెలుపు, నీలం మెరూన్ రంగు గల పువ్వుల చీర ధరించి ఉందని, మరే ఇతర వివరాలు తెలియలేదని అన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.







