UPDATED 23rd SEPTEMBER 2018 SUNDAY 9:00 PM
సామర్లకోట: సామర్లకోట రైల్వే స్టేషన్ ఒకటో నెంబర్ ఫ్లాట్ ఫారం డౌన్ లైన్ వద్ద గుర్తు తెలియని సుమారు 40 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతదేహం ఉన్న స్థితిని బట్టి ఆ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని, 5.4 ఎత్తుతో చామనచాయ రంగులో ఉన్నాడని రైల్వే హెడ్ కానిస్టేబుల్ విజయకుమార్ తెలిపారు.







