UPDATED 7th JUNE 2019 FRIDAY 6:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యా సంస్థల ప్రాంగణంలో గల ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ విభాగం అసిస్టెంట్ ఫ్రొఫెసర్ మందా రాజశేఖర్ ఆంధ్రా యూనివర్సిటీ నుంచి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (డాక్టరేట్) పొందినట్లు ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఆయన సమర్పించిన INVESTIGATION ON POLY PHASE SEQUENCES WITH OPTIMAL MERIT FACTOR & CORRELATION PROPERTIES USING CYCLIC ALGORITHMS అనే థీసిస్ కు ఈ డాక్టరేట్ లభించిందని తెలిపారు. యువకుడు, ఉత్సాహవంతుడు తమ సంస్థలో అసిస్టెంట్ ప్రొఫెసరుగా సేవలందిస్తున్న ఆయన మరింత మందికి మార్గదర్శకంగా నిలవాలని, విద్యార్థులకు చక్కటి మార్గనిర్ధేశికత్వం చేస్తూ ఉన్నతస్థాయికి చేరుకోవాలని ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి, క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాల్స్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, డాక్టర్ ఆదిరెడ్డి రమేష్, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది ఆయనను అభినందించారు. డాక్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (డాక్టరేట్ ) తన కోరిక అని ఆదిత్య క్యాంపస్ లో డాక్టరేట్ అయిన వారి బ్యానర్స్ చూసి తాను ఈ విధంగా అందరిచేత అభినందనలు అందుకోవాలని ఉండేదని, అందుకు ప్రొఫెసర్ & చైర్మన్, బివోఎస్ డాక్టర్ రాజేష్ కుమార్ గైడెన్స్ లో నా తల్లితండ్రులు మందా తాతయ్య, విజయమ్మల ఆశీస్సులతో ఈ థీసిస్ సమర్పించి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ పట్టా పొందడం ఆనందంగా ఉందని అన్నారు.







