UPDATED 10th SEPTEMBER 2017 SUNDAY 9:00 PM
పెద్దాపురం: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలో స్థానిక వర్జుల వారి వీధిలో ఉన్న భువనేశ్వరీపీఠంలో శరన్నవరాత్రి వేడుకలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పీఠాధిపతి చింతా గోపీశర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో ముహూర్తం రాట వేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం పీఠాధిపతి గోపీశర్మ సిద్ధాంతి మాట్లాడుతూ ఈ నెల 21 నుంచి 30 వ తేదీ వరకు శరన్నవరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించడంతో పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు, హోమాలు, అలాగే విశేష అర్చనలు, అలంకరణతో పాటు పూర్ణాహుతి, శమీవృక్ష పూజలు మొదలైన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరుకావాలని, అలాగే పూజలు, చండీ హోమాల్లో పాల్గొనే భక్తులు 9866193557 , 9989088557 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.







