అందుబాటులో ఉంటూ అభివృద్ధి చేస్తా..

* జై భారత్ నేషనల్ పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ గొరకపూడి చిన్నయ్యదొర
* నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం

UPDATED 31th MARCH 2019 SUNDAY 6:00 PM

పెద్దాపురం: ప్రజానీకానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ పెద్దాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని జై భారత్ నేషనల్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, పెద్దాపురం నియోజకవర్గ ఎంఎల్ఏ అభ్యర్థి డాక్టర్ గొరకపూడి చిన్నయ్యదొర అన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా పెద్దాపురం మండలం దివిలి, పులిమేరు గ్రామాల్లో ఆదివారం ఆయన విస్తృతంగా పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి కృషి చేస్తానని, పెద్దాపురం నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని అన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తమ పార్టీ ఆవిర్భవించిందని, ఈ ఎన్నికల్లో తమ పార్టీ గుర్తు గాజులుపై ఓటు వేసి తనను గెలిపించాలని ప్రజలను కోరారు. అనంతరం పులిమేరు గ్రామంలోని శాంతివర్ధనా దివ్యాంగుల పాఠశాలను సందర్శించి చిన్నారులతో ముచ్చటించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో దివిలి, పులిమేరు గ్రామాలకు చెందిన పలువురు జైభారత్ నేషనల్ పార్టీలో చేరారు. వారికి డాక్టర్ చిన్నయ్యదొర కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కె. అబ్బాస్, సత్యశ్రీ, అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.  

 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us