న్యాయాన్ని సామాన్యుడికి అందించాలి

UPDATED 31st MARCH 2018 SATURDAY 9:00 PM

పెద్దాపురం: న్యాయవాదులు న్యాయాన్ని సామాన్యుడికి అందేలా కృషి చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. స్థానిక కోర్టు కాంప్లెక్స్ ఆవరణలో ఏడవ అదనపు జిల్లా కోర్టు ఏర్పాటుకు హోంమంత్రి చేసిన కృషికి సన్మాన కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి చినరాజప్ప న్యాయవాదులను ఉద్దేశించి మాట్లాడుతూ సామాన్యులకు న్యాయాన్ని అందించడానికి న్యాయవాదులు కృషి చేయాలని, అలాగే ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు సూచనలు, సలహాలు ఇవ్వాలని, ప్రజలను కూడా అభివృద్ధి విషయంలో చైతన్యం తీసుకురావాలని కోరారు. పెద్దాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధిలో భాగంగా డిసెంబర్ నాటికి పూర్తిస్థాయిలో పనులు పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం కొత్త డివిజన్లు ఏర్పాటు చేసిన తర్వాత సామర్లకోటను ఈ కోర్టు పరిధిలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తానన్నారు. అదనపు జిల్లా కోర్టును పర్మనెంట్ చేయడానికి కృషి చేస్తానన్నారు. అనంతరం బార్ అసోసియేషన్ సభ్యులు మంత్రిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు, ఎఎంసి చైర్మన్ ముత్యాల వీరభద్రరావు(రాజబ్బాయి), బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పైడిపల్లి సూర్యనారాయణ మూర్తి (చిన్ని), వైస్ ప్రెసిడెంట్ పేరిశెట్టి మృత్యుంజయరావు, జనరల్ సెక్రటరీ దారా శ్రీనివాస్, ట్రెజరర్ ఎ.వి. జనార్దన్, జాయింట్ సెక్రటరీ కర్రా ఎలీషారావు, లైబ్రరీ సెక్రటరీ ఆర్. కామేశ్వరరావు, న్యాయవాదులు సాదే నరసింహారావు, కె.వి.రాయుడు, సారా రామచంద్రరావు, చావలి కృష్ణారావు, బొడ్డు లక్ష్మణరావు, పిట్టా సుగుణారావు, కందుల వెంకటాచలం, కందుల కుమార్, దేవులపల్లి సూర్యనారాయణ మూర్తి, ముమ్మన సోమరాజు, సి.హెచ్. కనకదుర్గారావు, గన్నంరాజు సత్యనారాయణ, తటవర్తి సత్యనారాయణ, ఎన్. దుర్గా ప్రసాద్, మడికి రాంబాబు, ఎస్.కె. వల్లిబాబు, దేవులపల్లి రవికుమార్, ఎన్.వి.ఎస్. మూర్తి (బాలు), డి.విల్సన్ రాయ్, టి. నూకరాజు, గోగులపాటి రామచంద్రరావు, తదితరులు పాల్గొన్నారు.    

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us