UPDATED 3rd JANUARY 2019 THURSDAY 5:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో ఉన్నత భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఎస్.రాయవరం, రంగంపేట గ్రామాలలో గురువారం ఇంటింటి సర్వే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్లు గ్రామంలోని ఇళ్ళకు వెళ్లి వారి స్థితిగతులు, సౌకర్యాలు, సమస్యలు వంటి విషయాలపై సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆదిరెడ్డి రమేష్ మాట్లాడుతూ ఉన్నత భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా డిసెంబర్ 29న జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో సర్వే నిర్వహించామని, మరో రెండు గ్రామాలలో కూడా త్వరలోనే ఇటువంటి సర్వేలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు జె. బాలమోహన్ రాజు, ఎమ్. సోమిరెడ్డి, బి. కాలేష్, ఎన్. కోటిరెడ్డి, జి.ఆర్.ఎమ్.పి. కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.







