UPDATED 14th DECEMBER 2018 FRIDAY 4:30 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం, రోటరీ బ్లడ్ బ్యాంక్ (కాకినాడ) సంయుక్త ఆధ్వర్యంలో కళాశాలలో శుక్రవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. రోటరీ బ్లడ్ బ్యాంకు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి. కామరాజు పర్యవేక్షణలో కొనసాగిన ఈ కార్యక్రమంలో ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు మాట్లాడుతూ తమ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం నిర్వహిస్తున్న రక్తదాన శిబిరానికి రోటరీ బ్లడ్ బ్యాంక్ అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నామని, భవిష్యత్తులో చేపట్టే వివిధ సామాజిక కార్యక్రమాలకు తమ వంతు సహాయం అందిస్తామని పేర్కొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శంభుప్రసాద్ మాట్లాడుతూ తమ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ప్రతీ సంవత్సరం నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాలతో లబ్దిదారులకు ప్రయోజనం చేకూరుతోందని, అత్యవసర సమయాల్లో ఈ కార్యక్రమం ద్వారా సేకరించిన రక్తం వారిని ఆదుకుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైద్య బృందం 120 మంది విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందికి ప్రాధమిక పరీక్షలు నిర్వహించి 100 మంది నుంచి రక్తం సేకరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరక్టర్ ఎం.వి. హరనాధబాబు, డైరక్టర్ డాక్టర్ జి. రఘురాం, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. సత్యనారాయణ, డీన్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ జి. నరేష్, డీన్ ఆర్&డి డాక్టర్ పి.వి.యస్. మాచిరాజు, వివిధ విభాగాధిపతులు, సీనియర్ అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ పి. రాజశేఖర ఫణీంద్ర, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ సుధీర్, ప్రమోద్, రఘురాం, అనుదీప్, ఎం. షాషిమ్, టి. సూర్యనారాయణ, వి. రామలింగేశ్వర్, టి. చైతన్య, పి. ప్రవల్లిక, డి. వర్షిత, తదితరులు పాల్గొన్నారు.







